1500 లంచం తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ అధికారులు...

1500 లంచం తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ అధికారులు...

చిట్యాల మండలానికి చెందిన సమయ్య కి పోస్టల్ డిపార్ట్మెంట్ ఉద్యోగం వచ్చింది. దీనికోసం మెడికల్ సర్టిఫికెట్ అవసరం ఉంది అని వరంగల్ ఎంజీఎం కి వస్తే అక్కడ ఆర్ఏంఓ డాక్టర్ హరీష్ రాజ్ దగ్గర  అటెండర్ గా ఉన్న శ్రీకాంత్ మెడికల్ సర్టిఫికెట్ కోసం 1500  డిమాండ్ చేశారు. కనీసం ఆర్ఎంఓ ను కలిసేందుకు కూడా అవకాశం ఇవ్వలేదు. వారం రోజుల పాటు తిప్పుకున్న అటెండర్  ఆర్ఏంఓ ఆదేశాలతోనే 1500 రూపాయలు అడుగుతున్నాను అని చెప్పడంతో ఏసీబీ అధికారులను కలిశారు. దీంతో ఆర్ఏంఓ ఆఫీసులో సమయ్య నుండి 1500 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండ్ గా పట్టుకున్నారు. ఇందులో ఆర్ఏంఓ పాత్ర పై అరా తీసున్నారు అధికారులు.. ఎంజీఎం లో ఏసీబీ అధికారుల తనిఖీలు వరంగల్  వైద్య సిబ్బందిలో లో హాట్ టాపిక్ గా మారింది.