హెచ్ఎండీఏ ప్లానింగ్ ఆఫీసర్ ఇంటిపై ఏసీబీ దాడి

హెచ్ఎండీఏ ప్లానింగ్ ఆఫీసర్ ఇంటిపై ఏసీబీ దాడి

ఏసీబీ అధికారుల వలలో మరో అవినీతి తిమిగలం చిక్కింది. హెచ్ఎండీఏ ప్లానింగ్ ఆఫీసర్ గా పనిచేస్తున్న భీంరావు ఇంటిపై గురువారం ఏసీబీ అధికారుల ప్రత్యేక బృందం సోదాలు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే సమాచారం రావడంతో ఏసీబీ అధికారుల దాడులు చేశారు. శేరిలింగంపల్లి ఆదర్శనగర్‌లోని భీంరావు ఇంట్లో గత కొన్ని గంటలుగా తనిఖీలు కొనసాగుతున్నాయి. భీంరావు ఇంటితో పాటు ఆయన కార్యాలయం, బందులువులు, స్నేహితుల ఇళ్లలో సోదాలు చేస్తున్నారు. అక్రమాస్తుల వివరాలను రాబట్టే పనిలో ఉన్నారు ఏసీబీ అధికారులు. ఏసీబీ అధికారి అయిన పురుషోత్తం రెడ్డికి భీంరావుకు సంబంధాలు ఉన్నట్టు సమాచారం.