ఈ తహసీల్దార్‌ ఇంట్లో ఎటుచూసినా డబ్బేడబ్బు!

ఈ తహసీల్దార్‌ ఇంట్లో ఎటుచూసినా డబ్బేడబ్బు!

ఆమె ఓ ఉన్నతాధికారిణి. అవినీతి ఆరోపణలు రావడంతో ఏసీబీ అధికారులు ఆమె ఇంట్లో దాడులు చేశారు. ఆ ఇంట్లో కట్టలకొద్దీ డబ్బు.. తులాలకొద్దీ బంగారు ఆభరణాలు.. లెక్కలేనన్ని ఆస్తుల పత్రాలు అధికారులను సైతం విస్మయానికి గురిచేశాయి. రంగారెడ్డి జిల్లా కేశంపేట తహసిల్దార్‌ లావణ్య ఇంట్లో సోదాలు చేసిన అధికారులు.. నోట్ల కట్టలు, బంగారం చూసి విస్తుపోయారు.
ఓ రైతు నుంచి రూ.8 లక్షలు లంచం తీసుకుంటూ ఒక వీఆర్వో ఏసీబీ అధికారులకు దొరికిపోగా.. అందులో తహసీల్దార్‌ లావణ్య వాటా రూ.5లక్షలని అతను అధికారులకు చెప్పాడు. వెంటనే  హైదరాబాద్‌ హయత్‌నగర్‌లోని శాంతినగర్‌లో ఉన్న ఆమె ఖరీదైన ఇంటిపై దాడి చేసిన అధికారులకు రూ.93.50 లక్షల నగదు, 40 తులాల బంగారు ఆభరణాలు, విలువైన ఆస్తి పత్రాలు లభించాయి. మరో విశేషమేంటంటే.. లావణ్యను రెండేళ్ల కిందట ప్రభుత్వం ఉత్తమ అధికారిణిగా గుర్తించడం.