గోడ కడుతుండగా ప్రమాదం.. ఒకరి మృతి

గోడ కడుతుండగా ప్రమాదం.. ఒకరి మృతి

కరీంనగర్‌లో విషాదం నెలకొంది. పట్టణంలోని అశోక్ నగర్‌లో అపార్ట్‌మెంట్‌ నిర్మణంలో ప్రమాదం జరిగి ఒకరు మృతి చెందారు. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. అపార్ట్‌మెంట్‌ నిర్మణ పనులు చేస్తున్న కూలీలపై అప్పుడే కట్టిన గోడ కూలింది. అక్కడికక్కడే ఒకరు మృతిచెందగా.. నలుగురి కాళ్లు విరిగాయి. గాయపడిన వారిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.