సింగరేణి బొగ్గుగనిలో విషాదం..

సింగరేణి బొగ్గుగనిలో విషాదం..

ఇటీవల కాలంలో సింగరేణి గనుల్లో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ప్రస్తుతం వున్న సమాచారం మేరకు.. రామగుండం డివిజన్ పరిధిలోని వకీల్‌పల్లి భూగర్భ బొగ్గు గనిలో జంక్షన్ కూలిపోవడంతో ప్రమాదం చోటుచేసుకుంది. గురువారం సాయంత్రం 66 లెవెల్‌లో 41 డీప్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న సింగరేణి యాజమాన్యం సహాయక చర్యలు చేపట్టింది. ఈ ఘటనలో మొత్తం నలుగురు కార్మికులు శిథిలాల కింద చిక్కుకున్నారు. అయితే స్థానిక అధికారుల ద్వారా ప్రమాదం నుంచి ముగ్గురు కార్మికులు తప్పించుకున్నట్లు తెలుస్తోంది. ప్రతి రెండు మూడు నెలలకు ఓ సారి ఇలా సింగరేణిలో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. సింగరేణి యాజమాన్యం తరఫు నుంచి అత్యున్నత భద్రతా ప్రమాణాలు పాటించినా కూడా ఇలాంటి ప్రమాదాలు జరుగుతుండడం పలు కుటుంబాల్లో విషాదాలు నింపుతోంది.