బొగ్గు గనిలో ప్రమాదం..23 మంది మరణం..

బొగ్గు గనిలో ప్రమాదం..23 మంది మరణం..

బీజింగ్: చైనాలో మరో దారుణం చోటుచేసుకుంది. బొగ్గు గనులలో మరో ప్రమాదం జరిగింది. అక్కడి శ్రామికులు దాదాపు 23మంది మరణించారు. దాంతో అక్కడ విషాద మేఘాలు అలముకున్నాయి. అయితే ఈ సంఘటన చైనా యంగ్‌చువాన్ ప్రాతంలో చోటుచేసుకుంది. అయితే ఈ ప్రమాదం నుంచి ఒక్కరు రక్షించబడ్డారు. వారు తెలిపిన దాని ప్రకారం ఆ ప్రాంతంలో కార్బన్ మోనాక్సైడ్ ఎక్కువగా ఉండటం కారణంగానే ప్రమాదం సంభవించిందని తెలిపారు. ఈ ప్రమాదం సాయంత్రం 5గంటల సమయంలో చోటుచేసుకుంది. అక్కడ 24 మంది వరకు పనిచేస్తున్నారు. అయితే వారు తమతమ పరికరాలను గొయ్యిలో వేస్తుండగా జరిగింది. దాంతో 24 మంది లోపల చిక్కుకుపోయారు. రక్షణ సిబ్బంది చేరుకునే సరికి 23 మంది మరణించి ఉన్నారు. ఒక్కరు మాత్రం రక్షించబడ్డారు. అతడు కూడా ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. అయితే ఈ ప్రమాదం రెండు నెలల వరకు మూతబడింది. ఈ ప్రమాదం పై ఇంకా విచారణ కొనసాగుతోంది.