చలాకీ చంటికి తృటిలో తప్పిన ప్రమాదం

చలాకీ చంటికి తృటిలో తప్పిన ప్రమాదం

టాలీవుడ్ కమెడియన్, యాంకర్ చలాకి చంటికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండల కేంద్ర జాతీయరహదారిపై చలాకి చంటి ప్రయాణిస్తున్న కారును వెనుక నుంచి వచ్చిన మరో కారు బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో వెనకాల కారు విద్వంసమవగా.. చంటి కారు స్వల్పంగా దెబ్బతింది. అయితే ఈ ప్రమాదంలో చంటికి ఎలాంటి గాయాలు కాకుండా సురక్షితంగా బయటపడ్డాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలంకు చేరుకుని కేసు నమోదు చేశారు. ఈ ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. జబర్దస్త్ కామెడీ షోలో టీమ్ లీడర్ అయిన చలాకి చంటి అతికొద్ది కాలంలోనే పాపులర్ అయ్యాడు. ఆపై అడపాదడపా సినిమాల్లో నటిస్తూ.. యాంకర్ గా పాపులర్ అయ్యాడు.