పోలీసుల ఎస్కార్ట్ నుంచి నింధితుడు పరారి...

పోలీసుల ఎస్కార్ట్ నుంచి నింధితుడు పరారి...

పోలీస్ ఎస్కార్ట్ కళ్లు గప్పి ఓ నింధితుడు పరారైన సంఘటన నర్సంపేట పట్టణ శివారులోని బుధవారం చోటు చేసుకుంది... భద్రాద్రి కొత్తగూడెం కు చెందిన కళ్లూరి గణేష్ హత్యా నేరంతో పాటు పీడి యాక్టు వంటి పలు కేసుల్లో నింధితుడుగా వుండి వరంగల్ సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. ఈ క్రమంలో కొత్తగూడెం కోర్టులో కేసు విచారణ నిమిత్తం హాజరు పరిచేందుకు బుధవారం ఉదయం ఏ ఎస్ ఐ, హెడ్ కానిస్టేబుల్, మరో నలుగురు సిబ్బంది పోలీసు ఎస్కార్ట్ వాహనంలో బయలు దేరివెళ్లారు. కోర్టులో విచారణ అనంతరం సాయంత్రం తిరిగి వస్తుండగా నర్సంపేట పట్టణ శివారులోని దామెర చెరువు సమీపంలో నింధితుడు గణేష్ మూత్రం పోస్తానని చెప్పి పోలీసుల కళ్లు గప్పి మాయమయ్యాడు. దీంతో ఒక్కసారిగా షాక్ గురైన పోలీసులు ఎంత వెతికిన కనిపించలేదు. దీంతో నర్సంపేట పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేయగా ఎస్ ఐ నవీన్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.