విజయారెడ్డి దహనం కేసులో సురేష్ పరిస్థితి విషమం

విజయారెడ్డి దహనం కేసులో సురేష్ పరిస్థితి విషమం

నిన్న రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ విజయా రెడ్డిని దారుణంగా సజీవ దహనం చేసిన సురేశ్, ఇప్పుడు చావు బతుకుల మధ్య ఉన్నాడు. ఈ ఘటనలో సురేశ్ కు సైతం తీవ్ర గాయాలు అయ్యాయి. శరీరం మీద దాదాపు 35 శాతం కాలిన గాయాలతో ఆసుపత్రిలో చేరిన సురేశ్, ఇప్పుడు కోమాలోకి వెళ్లడంతో, మెరుగైన చికిత్స కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించినట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి. సురేశ్‌ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు. సురేశ్‌కు వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించారు. సురేశ్‌ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. 74 గంటలు దాటితే తప్ప సురేశ్‌ ఆరోగ్యంపై చెప్పలేమని వైద్యులు పేర్కొన్నారు. ప్రస్తుతం నిందితుడు సురేశ్‌ న్యూరో బర్న్‌షాక్‌లో ఉన్నాడు. సురేశ్‌కు వైద్యులు ఫ్లూయిడ్స్‌ అందిస్తున్నారు. కేసు విచారణలో భాగంగా సురేశ్ ను పోలీసులు ఇప్పటికే ప్రశ్నించారు.