విజయారెడ్డి హత్య కేసులో కొత్త ట్విస్ట్..! సురేష్ భార్య సంచలన వ్యాఖ్యలు..

విజయారెడ్డి హత్య కేసులో కొత్త ట్విస్ట్..! సురేష్ భార్య సంచలన వ్యాఖ్యలు..

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ తహశీల్దార్ (ఎమ్మార్వో) సజీవదహనం కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది.. తాజాగా ఈ కేసు కొత్త మలుపు తిరిగింది. ఈ కేసులో నిందితుడైన సురేష్ తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందగా.. సురేష్ భార్య లత సంచలన వ్యాఖ్యలు చేసింది. ఎమ్మార్వోను భయపెట్టడానికే దాడి చేశానని తన భర్త చెప్పాడని వెల్లడించారు సురేష్ భార్య.. అయినా వినకపోవడంతో చంపాలనుకున్నానని తనతో చెప్పాడని చెప్పారామే. ఇక, ఇప్పటికే భూముల వ్యవహారంలో రూ.9లక్షల అప్పు చేశాడని ఆవేదన వ్యక్తం చేసిన సురేష్ భార్య... కానీ, ఆ డబ్బు ఎవరికి ఇచ్చాడో తెలియది చెప్పారు. అయితే, ఎమ్మార్వో లంచం అడిగిందని.. తర్వాత ఇస్తానని చెప్పినట్టు తనకు చెప్పాడని ఆమె వెల్లడించారు. ఇప్పుడు సురేష్ భార్య లత వ్యాఖ్యలతో కేసు కొత్త మలుపు తిరిగినట్టు అయ్యింది.