న్యాయవాది మృతికి కారణమైన నిందితుడు అరెస్ట్

న్యాయవాది మృతికి కారణమైన నిందితుడు అరెస్ట్

హైదరాబాద్ నారాయణగూడలో జరిగిన రోడ్డుప్రమాదంలో న్యాయవాది ప్రవీణ్ మృతికి కారణమైన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. బైక్ తో ఢీకొట్టి తప్పించుకు తిరుగుతున్న వారాసిగూడకు చెందిన 21 ఏళ్ల మహ్మద్ సిద్ధిఖ్ అబ్దుల్లాను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిపై ఐపీసీ 304 A, 337 సెక్షన్ కింద కేసులు నమోదు చేశారు. జనవరి 17వ తేదిన న్యాయవాది ప్రవీణ్ తన కుమార్తెను కళాశాలకు తీసుకెళ్తుండగా బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రవీణ్ అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోగా, కుమార్తె చేయికి తీవ్ర గాయాలయ్యాయి. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన నారాయణగూడ పోలీసులు ఎట్టకేలకు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.