ఏపీని వైసీపీ ప్రభుత్వం నాశనం చేస్తుంది..!

ఏపీని వైసీపీ ప్రభుత్వం నాశనం చేస్తుంది..!

వైఎస్ జగన్‌ సర్కార్‌పై మండిపడ్డారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు.. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఆంధ్రప్రదేశ్‌ని వైసీపీ ప్రభుత్వం నాశనం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఏపీకి ఉన్న ప్రత్యేక గుర్తింపును సీఎం వైఎస్ జగన్‌ పోగొట్టాడని ఆరోపించిన అచ్చెన్నాయుడు.. తిరుపతిని వ్యాపార సంస్థగా మార్చుకున్నారని విమర్శించారు.. అన్యమత ప్రచారానికి తిరుపతిని అడ్డాగా మార్చారని సంచలన ఆరోపణలు చేసిన ఆయన.. సీఎం జగన్‌ నాయకత్వంలోనే 142 ఆలయాలపై దాడులు జరిగాయని.. ఆలయాలపై దాడులు జరుగుతుంటే జగన్ నిద్రపోయారని ఎద్దేవా చేశారు.. ఇక, రాష్ట్రంలో డీజీపీ లేడు.. వైసీపీ అధికార ప్రతినిధి మాత్రమే ఉన్నారని.. డీజీపీపై సెటైర్లు వేశారు అచ్చెన్నాయుడు.. ఆలయాలపై దాడిచేశామని నిరూపిస్తే క్షమాపణ చెబుతామన్న ఆయన.. తిరుపతిలో రేపటి నుంచి ధర్మపోరాట యాత్ర చేపడుతున్నామని ప్రకటించారు.