రిలీజ్ కాకుండానే రికార్డులు సృష్టిస్తున్న ఆచార్య

రిలీజ్ కాకుండానే రికార్డులు సృష్టిస్తున్న ఆచార్య

మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిస్తున్న సినిమా ఆచార్య విడుదలకు ముందే సంచలనాలను సృష్టిస్తోంది. ఈ సినిమాను దర్శకుడు కొరటాల శివ ఎంతో శ్రద్దతో ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్నాడు. ఈ సినిమా వరుస అప్‌డేట్‌లతో అభిమానుల్లో ఉత్సుకతను మరింతగా పెంచతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదారాబాద్ కోకాపేటలో జరుగుతోంది. ఈ సినిమా కోసం కొరటాల శివ కోకాపేటలో భారీ సెట్ వేయించాడు. ఈ సెట్ దాదాపు 20ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. ఈ సినిమా కోసం టెంపుల్ టౌస్ సెట్టింగ్ వేశారు. ఇప్పటి వరకు ఏ దర్శకుడు ఇంత పెద్ద టెంపుల్ టైన్‌ను సెట్ వేయలేదని, ఇండియాలోనే ఇది ది గ్రేట్ సెట్ అని అంటున్నారు. దాంతో ఇంత భారీ రేంజ్‌లో ఇండియాలో సెట్ నిర్మించడం ఇదే తొలిసారి దాంతో ఈ సెట్ సరికొత్త రికార్డును చేసింది. అది ఆచార్య ఖాతాలో పడింది. ఈ సెట్‌లో చిరంజీవి పైన కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ నెల 10 తారీకుకు ఈ సెట్‌లో చిరంజీవి సన్నివేశాలు ముగుస్తాయని, ఇక తదితర పాత్రల సన్నివేశాలు షూట్ చేయాలని కొరటాల ప్లాన్ చేస్తున్నాడు. ప్రస్తుతం రామ్ చరణ్ కరోనా బారినపడి క్వారంటైన్‌లో ఉన్న విషయం తెలిసిందే. కరోనా నుంచి కోలుకున్న వెంటనే ఆయన సెట్స్ పైకి వస్తారట. దాదాపు 30 రోజుల పాటు చెర్రీ చిత్రీకరణ ఉంటుందని సమాచారం. అలాగే చిరంజీవి, రామ్ చరణ్‌లపై ఓ సాంగ్ కూడా చేయబోతున్నారట. త్వరత్వరగా ఈ షూటింగ్ మొత్తం పూర్తి చేసి ఈ వేసవిలో 'ఆచార్య' చిత్రాన్ని రిలీజ్ చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, కొణిదెల ప్రొడెక్షన్‌ కంపెనీ సంయుక్తంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాను దేవాలయాల్లో జరుగుతున్న అవినీతి నేపథ్యంలో రూపొందిస్తున్నారు. ఈ మెగా మూవీపై చిరంజీవి అభిమానుల్లో లెక్కకట్టలేనన్ని అంచనాలున్నాయి.