స్కూల్ టీచర్‌పై యాసిడ్‌ దాడి

స్కూల్ టీచర్‌పై యాసిడ్‌ దాడి

హైదరాబాద్ నగరంలోని చింతల్‌లో దారుణం జరిగింది. సంస్కార్ ప్రైవేటు స్కూల్‌ టీచర్‌ సూర్యకుమారి(30)పై ఈ రోజు సాయంత్రం గుర్తు తెలియని వ్యక్తి యాసిడ్‌ దాడి చేశాడు. దీంతో సూర్యకుమారి ముఖానికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే ఆమెను కుకట్ పల్లిలోని రెమెడీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దుండగుడి కోసం గాలిస్తున్నారు. అయితే దుండగుడు ముఖానికి కర్చీఫ్ కట్టుకొని దాడి చేయడంతో.. ఘటనా స్థలంలో ఉన్న వారు కూడా గుర్తుపట్టలేదు.