90 ఏళ్ల వృద్ధుడి యాక్షన్.. కష్టం అంటోన్న ఫైట్ మాస్టర్.. 

90 ఏళ్ల వృద్ధుడి యాక్షన్.. కష్టం అంటోన్న ఫైట్ మాస్టర్.. 

90ఏళ్ల వృద్ధుడు ఫైట్స్ చేయడం అంటే మాములు విషయం కాదు.   అసలు ఆ వయసులో పోరాటం చేయాలి అనే విషయం గురించి మర్చిపోవాల్సిందే. రియల్ లైఫ్ లో అది సాధ్యం కాదు. కానీ, రీల్ లైఫ్ లో మాత్రం తప్పకుండా సాధ్యం అవుతుందని అంటున్నారు కమల్ హాసన్.  కమల్ హాసన్ ప్రస్తుతం ఇండియన్ 2 సినిమా చేస్తున్నాడు.  ఈ సినిమాలో కమల్ 90ఏళ్ల వృద్దుడిగా కనిపిస్తున్నారు.  

ఇండియన్ సినిమాకు కొనసాగింపుగా వస్తున్న ఈ సినిమాలో కమల్ హాసన్ సేనాపతి గా కనిపిస్తున్నారు.  ఫస్ట్ పార్ట్ లోనే వృద్దుడిగా కనిపించిన కమల్.. ఇందులో మరింత వృద్దుడిగా కనిపిస్తున్నారు.  90 ఏళ్ల వయసులో ఉన్న కమల్ ఫైట్స్ కూడా చేయబోతున్నాడట.  ఆ వయసులో ఉన్న వ్యక్తికి.. బాడీ లాంగ్వేజ్ కు తగినట్టుగా ఫైట్స్ కంపోజ్ చేయడం కష్టంగా ఉందని అంటున్నారు ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్స్.  ఇండియన్ సినిమాలో హైలైట్ అయినట్టుగానే ఇందులో కూడా యాక్షన్ పార్ట్ హైలైట్ అవుతుందని యూనిట్ చెప్తోంది.  లైకా ప్రొడక్షన్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాకు శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు.  కాజల్, తమన్నా తదితరులు ఈ మూవీలో నటిస్తున్నారు.