సినిమా సెట్‌లో హఠాత్తుగా మరణించిన నటుడు

సినిమా సెట్‌లో హఠాత్తుగా మరణించిన నటుడు

మలయాళ సినిమా పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు ప్రబీష్ కన్నుమూశారు. సినిమా సెట్ లో ఉండగా హఠాత్తుగా ఆయన కుప్పకూలిపోయారు. తోటి నటుడు ఆయనను ఆసుపత్రికి తీసుకువెళ్ళేలోగా ఆయన మరణించారు. కేరళలో వ్యర్థ పదార్థాల నిర్వహణపై అవగాహన కల్పించేందుకు ఈ బృందం షూటింగ్ చేస్తుంది. త‌న పాత్ర‌లో భాగంగా షూటింగ్ పూర్తి చేసుకున్న ప్ర‌బీష్ త‌న స‌హ‌చ‌రుల‌తో ఫోటోలు దిగుతుండ‌గా సెట్లోనే కుప్ప‌కూలిపోయాడు.అతన్ని ఆస్పపత్రికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించినప్పుడు ఎటువంటి వాహనం ఆగలేదని అక్కడున్నవారు ఆరోపించారు. కొద్ది సేప‌టికి ప్ర‌బీష్ కార్లోనే ఆస్ప‌త్రికి త‌ర‌లించిన‌ట్లు సిబ్బంది తెలిపారు. ఆస్ప‌త్రికి త‌ర‌లించే మార్గం మ‌ధ్య‌లోనే అత‌ను మ‌ర‌ణించిన‌ట్లు తెలుస్తుంది.44 ఏళ్ల ప్ర‌బీష్ నటుడిగానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా ప్రత్యేకతను చాటుకున్నారు. ఆయన మృతికి పలువురు సెలబ్రిటీలు సంతాపం తెలిపారు.