ప్రభాస్ హీరో అనగానే ఓకే చెప్పేశా!

ప్రభాస్ హీరో అనగానే ఓకే చెప్పేశా!

బాహుబలి చిత్రంతో ప్రభాస్ ఎంత పాపులర్ అయ్యాడో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఈ హీరో సుజీత్ దర్శకత్వంలో 'సాహో' సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ప్రతి అప్డేట్ కూడా వైరల్ అవుతోంది. రోజురోజుకి ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి. అయితేఈ సినిమా కథ ఏంటి..? అనే విషయం నటీనటులకు తెలియదని మలయాళ నటుడు లాల్ చెబుతున్నారు. సీనియర్ నటుడైన లాల్ ఇటీవల దుబాయ్ షూటింగ్ లో పాల్గొన్నారు.
అక్కడ ప్రభాస్ తో తీసుకున్న ఫోటోను షేర్ చేస్తూ కొన్ని విషయాలను పంచుకున్నారు. ''ఈ సినిమాలో ప్రభాస్ హీరో అనగానే సినిమా చేయడానికి ఒప్పేసుకున్నాను. మంచి మనస్తత్వం గల వ్యక్తి. ఈ సినిమాలో నా క్యారెక్టర్ పాజిటివ్ గా ఉంటుంది. ఇంతకు మించి ఏం చెప్పలేను.. ఎందుకంటే ఈ సినిమా కథ ఏంటనేది యూనిట్ ఎవరికీ చెప్పలేదు. నటిస్తుంటే నాకు ఆ విషయం అర్ధమైంది. ముందుగా కథలో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించి తరువాత మిగిలిన సీన్స్ ను ప్లాన్ చేస్తున్నారు'' అంటూ వెల్లడించారు.