అనుష్క నెక్స్ట్ తెలుగు సినిమా ఇదేనా..?

అనుష్క నెక్స్ట్ తెలుగు సినిమా ఇదేనా..?

బాహుబలి, భాగమతి తరువాత అనుష్క నటిస్తున్న కొత్త సినిమా ఏంటి అనే విషయంపై సందిగ్దత ఏర్పడింది.  అనుష్క నెక్స్ట్ సినిమా ఇది అని ఇంతవరకు స్పష్టం కాలేదు.  పెళ్లి చేసుకోబోతున్నదని అందుకే ఏ సినిమాలకు సైన్ చేయలేదని వార్తలు వినిపించాయి.  వీటిపైనా ఎలాంటి స్పష్టత లేదు.  

గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నట్టు వార్తలు వచ్చాయి.  అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు.  స్వీటీ సినిమాలు ఎందుకు చేయలేదనే దానిపై సోషల్ మీడియాలో అనేక వార్తలు వస్తున్న సమయంలో ఓ న్యూస్ బయటకు వచ్చింది.  2006లో కోలీవుడ్ మన్మధుడు మాధవన్ తో కలిసి రెండు అనే సినిమా చేసింది.  ఇప్పుడు ఈ ఇద్దరు కలిసి సైలెన్స్ అనే సినిమా  చేయబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.  ఈ సినిమాను ఎవరు నిర్మిస్తున్నారు.. దర్శకుడు ఎవరు అనే విషయాలు సస్పెన్స్ గానే ఉన్నది. ఎప్పుడు ఈ న్యూస్ ను అధికారికంగా ప్రకటిస్తారా చూడాలి.