కోమాలోకి నటుడు నర్సింగ్ యాదవ్ .. అసలేం జరిగింది..?

కోమాలోకి నటుడు నర్సింగ్ యాదవ్ .. అసలేం జరిగింది..?

సినీ నటుడు నర్సింగ్‌ యాదవ్‌ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో ఆయన చికిత్స తీసుకుంటున్నారు. గత కొంత కాలంగా నర్సింగ్‌ యాదవ్‌ అనార్యోగం తో బాధపడుతున్నారని తెలుస్తుంది. ఆయనకు భార్య చిత్ర, కొడుకు రిత్విక్ యాదవ్‌ ఉన్నారు. గురువారం సాయంత్రం  గంటలకు వున్నట్టుండి కోమాలోకి వెళ్లారు నర్సింగ్ యాదవ్. నర్సింగ్ యాదవ్ భార్య చిత్ర మాట్లాడుతూ.. తన భర్త గురువారం  సాయంత్రం 4 గంటలు కు అపస్మారక స్థితిలోకి వెళ్ళేరని తెలిపారు. దాంతో ఆయనను  సోమజిగూడా యశోద ఆస్పత్రికి తరలించమని,48 గంటలు పాటు అబ్జర్వేషన్  లో ఉంచారుని, ఇంకా వెంటిలేటర్ పై నే చికిత్స కొనసాగుతుంది తెలిపారు. కాగా ఇంట్లో కింద పడిపోయాడు, తల కి గాయం అయ్యింది అని వస్తున్న వార్త లు అవాస్తవం ,తను ఎక్కడ పడిపోలేదు , ఉన్నట్లు ఉండి కోమా లోకి వెళ్ళిపోయాడని తెలిపారు. కోలుకుని తను ఆరోగ్యంగా ఇంటికి రావాలని దేవుని ప్రార్థిస్తున్నాం,సోషల్  మీడియా లో వస్తున్న వార్తలు ఎవరు నమ్మకండి, ఆయన క్షేమంగా ఇంటికి రావాలని అందరూ కోరుకోండి అని ఆమె కోరారు. ఇటీవల చిరంజీవి రీ ఎంట్రీ చిత్రం 'ఖైదీ నెంబర్ 150'లోనూ నటించారు నర్సింగ్ యాదవ్.