సన్నీ.. మీరు చాలా ఫన్నీ..!!

సన్నీ.. మీరు చాలా ఫన్నీ..!!

సన్నీ లియోన్ గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు.  పెద్దల సినిమా రంగం నుంచి బాలీవుడ్లోకి వచ్చింది.  సినిమా రంగంలోకి వచ్చిన తరువాత సన్నీలియోన్ తో సినిమాలు చేయడానికి చాలామంది ఇబ్బందులు పడ్డారు.  సన్నీలియోన్ తో సినిమా చేస్తే ఎక్కడ తమ పేరు తగ్గిపోతుందో అని భయపడ్డారు. 

కానీ, ఇప్పుడు ఆమెతో సినిమాలు చేసేందుకు ప్రతి ఒక్కరు ముందుకు వస్తున్నారు.  తాజగా సన్నీలియోన్ రాగిణి ఎంఎంఎస్ రిటర్న్ అనే వెబ్ సీరీస్ చేస్తున్నది.  సీజన్ 2 కోసం షూటింగ్ చేస్తున్నారు.  ఇందులో సన్నీలియోన్ తో పాటుగా ఇందులో నవదీప్ కూడా నటిస్తున్నాడు.  సన్నీలియోన్ సెట్స్ లో చాలా ఫన్నీగా అందరితో సరదాగా ఉంటుందట.  ఒక్కసారి పరిచయమైతే ఆమెతో మాట్లాడుతూ సమయం తెలియకుండానే అయిపోతుందని నవదీప్ చెప్తున్నాడు.  సన్నీలియోన్ సినిమాలు, వెబ్ సీరీస్ లు చేస్తూనే.. మరోవైపు స్టార్ స్టేక్ అనే సౌందర్య ఉత్పతుల వ్యాపారం కూడా చేస్తున్నది.