హాట్ లుక్స్‌తో మళ్ళీ షాక్ ఇచ్చిన నటి

హాట్ లుక్స్‌తో మళ్ళీ షాక్ ఇచ్చిన నటి

తెలుగు సినిమాల్లో తల్లి పాత్రలకు పెట్టిన పేరుగా చెప్పుకునే నటి ప్రగతి. కారెక్టర్ ఆర్టిస్టుగా ప్రగతి మంచి గుర్తింపు పొందింది. ఈమె చేసే పాత్రలకు పూర్తి స్థాయిలో న్యాయం చేస్తుంది. అయితే ఈమె గత కొంత కాలంగా సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్‌గా ఉంటూ మంచి ఫాలోయింగ్ తెచ్చుకుంది. ఇదిలా ఉంటే ఇటీవల ఈమె తన 16 ఏళ్ల కూతురు పుట్టిన రోజు సందర్భంగా ఓ పార్టీ చేసింది. ఇప్పటి వరకు ఆమెకు కూతురు ఉన్న విషయం ఎవ్వరికీ తెలీదు. ఈ విషయాన్ని కూతురు బర్త్‌డే సందర్భంగా బయటపెట్టింది. చిన్న వయసులోనే హీరోలకు, హీరోయిన్‌లకు తల్లి పాత్రలు చేయడం మొదలు పెట్టిన ప్రగతికి ఇంత పెద్ద కూతురుందని ఎవ్వరు అనుకోలేదు. ఎందుకంటే ప్రగతి తన కుటుంబ విషయాలను సోషల్ మీడియాలో అస్సలు చర్చించదు. తన కూతురు పుట్టిన రోజు సందర్భంగా ప్రగతి దిగిన ఓ సెల్ఫీ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది. ఇందులో ప్రగతి, తన కూతురు హాట్ డ్రస్సులు వేసుకొని ఉన్నారు. ఆమె కూతురు కూడా ఎంతో అందంగా ఉంది. ఈ హాట్‌లుక్స్ పిక్స్ తెగ వైరల్ అవుతున్నాయి. దాంతో ప్రగతి తన కూతురిని సినిమాల్లోకి త్వరలో తీసుకొస్తుందేమో అని అభిమానులు అనుకుంటున్నారు. మరి ఈ విషయంపై ప్రతగి ఏమని స్పందిస్తుందో వేచి చూడాలి.