నేను జనాలతోనే ఉంటా... 

నేను జనాలతోనే ఉంటా... 

వెండితెరపై విలక్షణ నటనను ప్రదర్శించిన ప్రకాశ్ రాజ్ ఇప్పుడు జస్ట ఆస్కింగ్ అంటూ ప్రభుత్వాలపై ప్రశ్నల బాణాలు సంధిస్తున్నారు. ముఖ్యంగా మతతత్త్వ రాజకీయాలకు వ్యతిరేకంగా ఆయన గళాన్ని వినిపిస్తున్నారు. కర్నాటక ఎన్నికల్లో విస్తృతంగా పర్యటిస్తున్న ఆయన ఎన్టీవీతో ఎక్స్ క్లూజివ్ గా మాట్లాడారు. 
యాంకర్ : కర్నాటక ఎన్నికల ప్రచారం విస్తృతంగా చేస్తున్నారు. ఎలా మీకు ప్రజల నుండి వచ్చే స్పందన.? 
ప్రకాశ్ రాజ్ : చాలా బాగుంది. ఈ ప్రయాణంలోకి వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. సమాజం కారణంతో ఎదిగిన నేను నా జీవితానికి ఒక అర్థం దొరికింది. సమాజం చెడుతున్నప్పుడు వాస్తవాలను తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు ప్రజల నుండి నాకు ఓట్లు కాదు ముఖ్యం. నేను ప్రేక్షకుడి లాంటివాడినే. నేను ప్రజలం మాట్లాడుకుంటున్నాం. నా అవగాహన మేరకు ఏది మంచి అయితే అది చెప్తూ పోతున్నాను. అద్భుతమైన స్పందన వస్తుంది.  
యాంకర్ : జస్ట్ ఆస్కింగ్ అనేది మీ నినాదం. కానీ.. మీ ప్రశ్న ఎప్పుడూ మోడీ వైపు గురిచూస్తున్నట్లు అనిపిస్తుంటుంది.? 
ప్రకాశ్ రాజ్ : ఇప్పుడు మోడీవైపు ఉండవచ్చు. రేపు అందరివైపుకు వస్తుంది. నేను రాజకీయ పక్షిని కాదు. ఎమ్మెల్యేనో.. ఎంపీనో కావాలని లేదు. సమాజాన్ని పీడిస్తున్నది ఇప్పుడు మతం.. జాతీ ఇవన్నీ.. బీజేపీతో నాకు శత్రుత్వం ఎందుకంటే... ఒక జాతీ.. ఒక సంవిధానంతో ఇండియాను పాలించాలని చెప్తుంది. అది కాదు.. కదా భారతదేశంలో.. విభిన్న కులాలు, మతాలు అందరినీ సమదృష్టితో సౌహార్థ్రభావంతో బ్రతుకుతున్న జీవులను తప్పుదారి పట్టిస్తున్నప్పుడు వాళ్లకు వ్యతిరేకంగా నేను మాట్లాడాను.  ఇప్పుడు ముఖ్యమంగా మతాలు, కులాలను పెట్టుకొని రాజకీయం చేయడం నాకు నచ్చలేదు. ఇది చాలా డేంజర్ భారతదేశానికి.  
యాంకర్ : ముఖ్యంగా మీ వ్యతిరేకత బీజేపీ సిద్ధాంతాల మీదా? లేకా మోడీ వైఖరిపైనా?  
ప్రకాశ్ రాజ్ : రెండింటిపైన.. నిజం చెప్పాలంటే ప్రత్యేకంగా బీజేపీకి సిద్ధాంతాలు అంటూ ఏం లేవు. మరెవరో సిద్ధాంతాలకోసం వాళ్ల సిద్ధాంతాలుగా పని చేస్తున్నారు. వారి వెనకాల ఉన్న హిందూ ధర్మ.. అసలు హిందూ ధర్మం వేరు... వారి ఫిలాసపీ వేరు. నేషనాలిటీ వేరు. అలాగే వీరికి ఎలాంటి ఐడియాలజీ.. సిద్ధాంతాలు లేవు.  అసలు దేశానికి భవిష్యత్తు చూపిస్తానని చెప్పిన వచ్చిన మోడీ ముడున్నరేళ్లుగా ఏం చేయలేదు. ఏంటని అడిగితే... నీవు హిందువు కాదు అంటాడు. ఇంకా నీవు ఇండియనే కాదు.. దేశ ద్రోహి అంటాడు. భారతీయ యువత జాబ్స్ లేక ఎంత అసహనంతో ఉన్నారు. నీవు ఇచ్చిన కలలు కన్నారు. ఏం చేస్తున్నారు.. బ్లాక్ మనీ తీసేస్తానన్నాడు. ఇంకా సంవత్సరం దాటినా కొరత నడుస్తూనే ఉంది. నోట్లు అన్నీ ధనవంతుడి వద్దే ఉన్నాయి. ఆర్బీఐ కూడా బ్లాక్ మనీ లెక్కలు ఇవ్వడం లేదు.  అలాగే.. మీరు నాకోసం కొంచం భరించండి అన్నారు. లేకపోతే శిక్షించండి అన్నారు. భరించాం... ఇంకా రైడ్స్ జరుగుతున్నాయంటే బ్లాక్ మనీ పోలేదు. ఎందుకు అబద్ధం చెప్పడం. 
యాంకర్ : ఈ ప్రశ్నించడం అనేది ఎలక్షన్ వరకే ఉంటుందా. లేకా ఎంతవరకు ఉంటుంది. ముందు ముందు ఎలా వెళ్తారు? 
ప్రకాశ్ రాజ్ : ఎన్నిలకు ముందే జస్ట్ ఆస్కింగ్ స్టార్ట్ చేశాను. ఇంకా ముందుకు వెళ్తుంది. అన్నిచోట్లకు వెళ్తుంది. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఏ పార్టీ కూడా ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేదు. కర్నాటకలో వేరు వేరు జిల్లాల నుండి 3వేల మంది ఈ జస్ట్ ఫర్ ఆస్కింగ్ కు కనెక్ట్ అయ్యారు. ఎలక్షన్ తర్వాత ఏ పార్టీ వచ్చినా ప్రశ్నించేవాడి వెనక అండగా జస్ట్ ఆస్కింగ్ నిలిచి పోరాడుతుంది. మొత్తం కర్నాటకలో మొత్తం సెమినార్స్ చేస్తున్నాం. ఈ దేశంలో ఏం జరుగుతుందని అనే దాన్ని తెలుసుకుంటాం అలా ముందుకు వెళ్తాం. అన్నింటికీ బాధ్యులం మనమే. డబ్బు తీసుకొని, కులాలు చూసి, మరో చోట ఓటు వేయకుండా వదిలేసింది మనమే. అలా ప్రజలందరికీ రాజకీయ చైతన్య తేవాలని.. అవగాన ఉండాలని కోరుతున్నాం. అందుకే నేను ఏ పార్టీ, ఎమ్మెల్యే కాకుండా ప్రజలతో ఉండి పోరాడటానికి నిర్ణయించుకున్నా. 
యాంకర్ : మీరు బీజేపీకి ఓటు వేయవద్దు అంటున్నారు. మరే ఇంక మీరు ఏ పార్టీకి ఓటు వేయమని కోరుతున్నారు.
ప్రకాశ్ రాజ్: ప్రజలే ఆలోచించి వేయండి. కాంగ్రెస్, జేడీఎస్, స్వతంత్రులు, కొన్నిచోట్ల బీజేపీ నేతలు మంచివారు ఉన్నారు. వాళ్లని అడగాలి. మీరు ఎందుకు ఆ పార్టీలో ఉన్నారని. వారిని అందరినీ అడిగి పని చేసే వాడికే ఓటు వేసి ఎన్నుకోండి. 
యాంకర్ : మీరు ముఖ్యంగా జేడీఎస్ కు మద్దతిస్తున్నారని టాక్ నడుస్తుంది. ఎందుకంటే కేసీఆర్ తో కలిసి దేవగౌడను కలవడంతో.. దీనిపై మీ అభిప్రాయం.? 
ప్రాకాశ్ రాజ్ : దేవగౌడ, కుమారస్వామి అందరినీ కలిశాను. వాళ్లు పూర్తి మెజారిటీ వచ్చే పరిస్థితి లేదు. నేను అడిగాను. బీజేపీతో కలిసి ముందుకు వెళ్తారా అని. అందుకు వారు సమస్యే లేదు అన్నరు. అందుకే వెళ్లి కలిపించాను. ముఖ్యంగా కేసీఆర్ నాలోని రాజకీయ కోణాన్ని చూసి నీవు రాజకీయాలకు పనికొస్తావ్ రా.. మీది కర్నటకే కదా అన్నారు. అలా వెళ్లి కలిశాం అంతే. 
యాంకర్ : ఆ మధ్య మీరు కేసీఆర్ ను కలవడం ఆయన బయోపిక్ లో మీరు నటిస్తున్నారని.. అందుకే అసెంబ్లీలో అంతా చాలా సేపు గడిపారని టాక్.. దానిపట్లు మీ అభిప్రాయం. 
ప్రకాశ్ రాజ్: అది వాస్తవం కాదు. తెలంగాణ పంచాయితీ రాజ్ అంటే నాకు ఇష్టం. రాజకీయాలు ఎప్పుడూ ముచ్చటించుకుంటా గానీ... అలాంటివేం లేదు మా మధ్య. 
యాంకర్ : 2019 ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్ పాత్ర ఏ విధంగా ఉండబోతుంది. ? 
ప్రకాశ్ రాజ్ : నేను మొదలెట్టేశాను. పార్టీపరంగా కాదు. జనాల్లో నుంచి జనచైతన్యం నుంచి వస్తున్నాను. ఇలాంటి ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికీ అలవడేలా చేస్తాను.  
యాంకర్ : కేసీఆర్ ప్రభుత్వంలో మీకు ఏ ఎలిమెంట్ ఆకర్షించింది.? 
ప్రకాశ్ రాజ్ : అతను నాకు రైతులా దర్శనమిస్తాడు. మట్టిలోంచి వచ్చిన వ్యక్తి. మట్టిమనిషిగా అతను చేస్తున్న మిషన్ భగీరథ కానీ అన్నీ నన్ను అట్రాక్ట్ చేసినవి. అల్ప సంఖ్యాక వర్గాలకు ఆయన చేస్తున్న సేవ అపారం. ఇలాంటివి అన్నీ ఆయన దగ్గరకు నన్ను చేర్చినవి. 
యాంకర్ : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై మీ అభిప్రాయం ఏంటి? 
ప్రకాశ్ రాజ్ : బాబు కంటే ముందుకు ఏపీ ప్రజల గురించి మాట్లాడాలి. వారికి చాలా పెద్ద అన్యాయం జరిగింది. మోడీ.. వెంకయ్యనాయుడు ముందు ఓపన్ గా స్టేట్ మెంట్ ఇచ్చారు ప్రత్యేకహోదాపై. ఆ తర్వాత అది మరిచి ప్రజలతో ఆడుకుంటున్నారు. చంద్రబాబును తప్పుపట్టలేం. ఏపీ ప్రజలు అడుక్కోవడం లేదు. ఏపీ ప్రజల హక్కు అది. 
యాంకర్ : రాబోవు ఎన్నికల్లో కేసీఆర్ టీఆర్ఎస్ తరఫున ప్రచారం చేస్తారా? 
ప్రకాశ్ రాజ్ : ఏ పార్టీ తరఫున నేను ప్రచారం చేయను. అది నా సిద్ధాంతాలకు విరుద్ధం. ప్రజలను చైతన్యం చేస్తాను అంతే. 
యాంకర్ : పవన్ కల్యాణ్ కూడా ఓ పార్టీ పెట్టి జనాల్లోకి వెళ్తున్నారు. ఆయనపై జనసేనపై మీ అభిప్రాయం ఏంటి? 
ప్రకాశ్ రాజ్ : పవన్ కల్యాణ్ కు ఓ ఆవేదన ఉంది.  ప్రజలకు ఏదో మంచి చేయాలని ఉంది. నాకు పార్టీ పెట్టి మంచి చేయాలని లేదు. పవన్ కు డబ్బు కోసం పార్టీ పెట్టలేదు. అవన్నీ ఆయనకు ఉన్నాయి. అవన్నీ మించి ఏదో మంచి చేయాలనే వస్తున్నారు. ఆయనతో పాటు ఎంతమంది సిద్ధాంతులు నచ్చి కలిసి నడుస్తారు అనేది చూడాలి. వచ్చి ఆయననే పొల్యూట్ చేస్తారా అనేది కూడా చూడాల్సి ఉంది. ఆయన వేగాన్ని చూస్తే... ముక్కు సూటిగా మాట్లాడుతున్నారు. ఆహ్వానిద్దాం.. 
యాంకర్ : ప్రశ్నిస్తే వ్యక్తిగత దాడి జరుగుతుందన్నారు. మీపై ఏమన్నా అలాంటివి జరిగాయా? 
ప్రకాశ్ రాజ్ :  మోడీ అంటే మోడీ కాదు. ఆయన పెద్ద అబద్ధాల కోరు. మనదేశంలో ఇంత అబద్ధాలు చెప్పే ప్రధానిని ఎప్పుడూ చూడలేదు. నీ కొడుకు చనిపోయినప్పుడు నీవు ఎవరితో పడుకున్నావ్. నీవు సినిమాలో విలన్ కాబట్టి..రియల్ లైఫ్ లో విలన్ అని.. ఇలా చేస్తున్నారు. రెండు పెళ్లిల్లు ఎలా చేసుకున్నావ్. అంటే వాళ్ల బుర్రలో సమాధానాలు లేవు.  
యాంకర్ : కర్నాటక, తమిళనాడులో కావేరి వివాదం ఇంకా నలుగుతుంది. దీనిపట్లు మీ అభిప్రాయం.? 
ప్రకాశ్ రాజ్ : కావేరి విషయం నిండా రాజకీయాలే ఉన్నాయి.  అసలు రియాల్టీని చూడటం లేదు. అక్కడ ఎంతసేపటికీ.. కమల్ హాసన్, రజనీకాంత్.. ప్రకాశ్ రాజ్ స్టేట్ మెంటే వారికి కావాలి గానీ.. వాస్తవాలు తెలుసుకోవడం.. దాని పరిష్కారం చూడటం లేదు. కావేరి ద్వారా ఎలా బెంగుళూరు వాటర్ తెప్పించవచ్చు ఆలోచించడం లేదు. అసలు కావేరి నీరు ఎక్కడ నుంచి వస్తుంది. దాన్ని ఆ అరణ్యాన్ని కాపాడటం లేదు. ఇలాగే వెళ్తే.. మరికొంత కాలం నీళ్లే ఉండవు. 
యాంకర్ : మీ బాణాలు అన్నీ మతతత్త్వ రాజకీయాల మీదే ఉన్నట్లుంది. వీటి తర్వాత వేటిపై మీ ప్రశ్నాస్త్రాలు ఉంటాయి. మీ భవిష్యత్తు ప్రణాళిక ఏమిటి? 
ప్రకాశ్ రాజ్ : ప్రశ్న అడగడం అంటే రాళ్లు వేయడం కాదు. అసలు సమస్య ఏంటి.. దానికి పరిష్కారం ఎలా ఉండాలి అని సమష్టిగా ప్రజలకు తెలిపేలా ఆ ప్రశ్నల పరంపర సాగాలి.  
యాంకర్ : ఈ ఎన్నికల్లో కర్నాటకలో బీజేపీని రాకుండా అడ్డుకోగలరు అనుకుంటున్నారా? ఏవిధంగా ఫలితాలు ఉండగలవు? 
ప్రకాశ్ రాజ్ : రాదు బీజేపీ.. కర్నాటకలోనే కాదు. 2019ఎన్నికల్లో ఢిల్లీలో కూడా రాదు. ఉత్తరభారతీయులు తెలుసుకుంటున్నారు. మన నెక్స్ట్ ప్రధాని నరేంద్రమోడీ కాదు. దీనిపై నాకు స్పష్టత ఉంది. తెలంగాణలో రాదు. ఆంధ్రాలో రాదు. తమిళనాడు లో అడుగుకూడా పెట్టరు. కేరళలో రాదు. కర్నాటకలో ట్రై చేస్తున్నారు. ఏంటంటే ప్రజలు అంటే ముగ్ధులైన హిందువులను వాళ్లు వాడుకుంటున్నారు. అంతే అక్కడ జరుగుతుంది. ధర్మ అని చెప్పి.. యూపీలో దారుణాలు చేస్తున్నవి అన్నీ ప్రజలు తెలుసుకుంటున్నారు. పంజాబ్, హర్యానాలో ఎంతవరకు మహిళలకు, బడుగు బలహీన వర్గాలకు భద్రత ఉంది. అంతా తెలుసుకుంటున్నారు. అయితే కర్నాటకలో బీజేపీ ప్రభుత్వం రాదని... రాబోవు 2019 ఎన్నికల్లో దేశంలోనే బీజేపీ ఉండదని ప్రకాశ్ రాజ్ కుండబద్ధలు కొట్టినట్లు వెల్లడించారు. ఇంకా ప్రకాశ్ రాజ్ ఏం మాట్లాడారో తెలుసుకోవాలంటే క్రింది వీడియోను క్లిక్ చేయండి.