వరదలో నుంచి హీరో తల్లిని కాపాడిన స్థానికులు...

వరదలో నుంచి హీరో తల్లిని కాపాడిన స్థానికులు...

కేరళ వర్షాలు, వరదలతో అతలాకుతలం అవుతూనే ఉంది... ఈ వరదలో సినీ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఇల్లు నీటమునిగిపోయింది... పృథ్వీరాజ్ సుకుమారన్ తల్లి మల్లికా సుకుమారన్‌ను స్థానికులు కాపాడారు. నలుగురు స్థానికులు ఆమెను ఈ రోజు ఉదయం వాటర్ టబ్బులో తీసుకొని వెళ్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో కనిపించాయి. ఇక వరదలో పృథ్వీరాజ్ సుకుమారన్ ఇంటి పరిసరాలు మునిగిపోయి... ఇంట్లోకి నీరు చేరిన ఫొటోలు, కార్లు మునిగిపోయిన ఫొటోలు కూడా ఆన్‌లైన్‌లో కనిపిస్తున్నాయి.