సూపర్ స్టార్ రజనీకాంత్ కు కరోనా ...నటుడు ట్వీట్

సూపర్ స్టార్ రజనీకాంత్ కు కరోనా ...నటుడు ట్వీట్

సూపర్ స్టార్ రజినీకాంత్ కొరోనా వైరస్ బారిన పడ్డారన్న వార్త ఆయన అభిమానులను కలవరపాటుకు గురిచేసింది. బాలీవుడ్ నటుడు రోహిత్ రాయ్ సోషల్ మీడియా వేదికగా" సూపర్ స్టార్ రజినీకాంత్ కు కరోనా పాజిటివ్ అని వచ్చింది కానీ కరోనా క్వారంటైన్ కు వెళ్ళింది" అంటూ పోస్ట్ చేసాడు.ఆ వార్త విన్న అభిమానులు ముందు కంగారు పడ్డారు. తరువాత అది జోక్ అని తెలిసి ఊపిరిపీల్చుకున్నారు. మొదట కంగారు పడ్డ అభిమానులు న్యూస్ కోసం వెతుకులాట ప్రారంభించారు.అయితే ఎక్కడా దీనికి సంబంధించిన వార్త రాలేదు.. పైగా కాసేపటికే ఆ పోస్ట్ జోక్ అని తేలింది.  దాంతో అభిమానులు రోహిత్ రాయ్ ని తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు. 'జోక్ పరమ చెత్తగా ఉంది', 'కరోనా కామెడీ కాదు, 'ఇటువంటి తప్పుడు వార్తలు ఒక నటుడైఉండి ఎలా ప్రచారం చేస్తారు', 'ఇలాంటి జోక్ భారతీయ సంస్కృతి కాదు', అంటూ దుమ్మెత్తిపోశారు. ఈ ట్రోలింగ్‌పై స్పందించిన రోహిత్  'మీరు ఎందుకంత ఆవేశపడుతున్నారు.? మిమ్మల్ని నవ్వించాలనుకున్నాను. కానీ ఇలా అవుతుందనుకోలేదు,  క్షమించండి' అంటూమరో పోస్ట్ పెట్టాడు.