సైకిల్ పై వచ్చి ఓటేసిన స్టార్ హీరో

సైకిల్ పై వచ్చి ఓటేసిన స్టార్ హీరో

నేడు దక్షిణ భారతదేశంలో మూడు రాష్ట్రాలు తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి అసెంబ్లీలకు పోలింగ్ కొనసాగుతోంది. పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్ట్రాల్లో మూడో దశ పోలింగ్ కొనసాగుతోంది. తమిళనాడు, కేరళ పుదుచ్చేరిలో ఒకే విడతలో పోలింగ్ జరగనుండటం విశేషం. కరోనా వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో అన్ని ఈసీ జాగ్రత్త చర్యలు తీసుకుంది. ఇక తమిళనాడులోని 234 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 88,936 పోలింగ్‌ కేంద్రాల్లో పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. సినీ ప్రముఖులు కూడా క్యూలో నిలబడి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అయితే తాజాగా తమిళ స్టార్ హీరో విజయ్ సైకిల్ పై పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటేశాడు. దేశంలో పెరుగుతున్న పెట్రోల్ ధరలకు నిరసనగానే విజయ్ సైకిల్ పై వచ్చాడంటూ సోషల్ మీడియాలో చర్చలు మొదలైయ్యాయి. మరోవైపు కరోనా లాంటి పరిస్థితుల్లో ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలనే ఆయన సూచన చేస్తున్నట్లుగా మరికొందరు చెప్పుకొస్తున్నారు.