భగత్ సింగ్ ను తలపించావ్ ..కంగన ఫై విశాల్ ప్రశంసలు..!

భగత్ సింగ్ ను తలపించావ్ ..కంగన ఫై విశాల్ ప్రశంసలు..!

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగన రనౌత్ పై నటుడు విశాల్ ప్రశంసల వర్షం కురిపించాడు. కంగన కు సంబంధించిన ముంబైలోని ఆఫీస్ ను అక్రమ కట్టడం కింద అధికారులు కూల్చి వేసిన సంగతి తెలిసిందే. దాంతో ఆమె మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాక్రే పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఓ వవీడియోను విడుదల చేసింది. వీడియోలో "నా  ఆఫీస్ కూలినట్టే మీ గర్వం కూడా ధ్వంసం అవుతుంది " అంటూ కంగన ఘాటు కామెంట్లు చేసింది. కాగా ఈ విషయంపై హీరో విశాల్ స్పందించాడు. కంగన ను ఉద్దేశిస్తూ విశాల్ ఆసక్తికర ట్వీట్ చేసారు. "కంగనా... నీ గట్స్‌కి నా హ్యాట్సాఫ్‌. ఏది తప్పు ఏది ఒప్పు అనే విషయాలను వ్యక్తపరచడానికి నువ్వెప్పుడూ వెనకాడలేదు. నీకు సంబంధించిన విషయాలు కాకపోయినా వాటి గురించి నువ్వు మాట్లాడి, ప్రభుత్వం నుంచి కొంచెం ఇబ్బంది ఎదుర్కొన్నావు. అయినా ధైర్యంగా నిలబడ్డావు. నీ వైఖరి 1920లో భగత్‌సింగ్‌ను తలపించింది. తప్పు ఉన్నప్పుడు ప్రభుత్వానికి ఎదురుగా ఎవరైనా మాట్లాడొచ్చు అని ఓ ఉదాహరణ చూపించావు" అంటూ విశాల్ కంగనను ప్రశంసించాడు. ఇక ఈ భామ ధైర్యాన్ని ఇండస్ట్రీలోని కొందరు మెచ్చుకుంటే..మరికొందరు విమర్శిస్తున్నారు. కంగన వర్సెస్ మహా సర్కార్ గొడవ ఎక్కడివరకు వెళుతుందో చూడాలి.