నెపోటిజం పై నటి అధితి రావు హైదరి సంచలన వ్యాఖ్యలు...!

నెపోటిజం పై నటి అధితి రావు హైదరి  సంచలన వ్యాఖ్యలు...!

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య తరవాత  చిత్ర పరిశ్రమలో నెపోటిజం అనే పదం బాగా వినిపిస్తుంది. నెపోటిజం అంటే వారసత్వం అని అర్థం. సుశాంత్ మరణం తరవాత బాలీవుడ్ పరిశ్రమలో నెపోటిజం ఎక్కువగా ఉందని నెటిజన్లు మండిపడ్డారు. అంతేకాకుండా కొంతమంది ప్రముఖ నటీనటులు సైతం సుశాంత్ మృతికి నెపోటిజం కారణమంటూ వ్యాఖ్యలు చేసారు.ఇక తాజాగా నెపోటిజం పై పద్మావతి హీరోయిన్ అధితి రావు హైదరీ స్పందించారు. 

మీడియాతో మాట్లాడిన అదితి రావు హైదారి నెపోటిజం అనేది చాలా దుర్వినియోగమైన పదం అని అన్నారు. తాను దేనిపైనా చింతించే  వ్యక్తి కాదని, తన నియంత్రణలో లేని విషయాల గురించి ఎందుకు ఆలోచించాలని అదితి రావు అన్నారు. ప్రతిభ, కృషి, సమయస్ఫూర్తి, తనను తాను మంచిగా చేసుకోవడం, నేర్చుకోవడం, క్రమశిక్షణ వంటి వాటిపై దృష్టి పెట్టాలని ఆమె అన్నారు. తల్లిదండ్రుల వ్యాపారంలోకి రావడానికి ఒక వ్యక్తి పిల్లలు ఎక్కువ అవకాశాలు కలిగి ఉండటం చాలా సహజమని ఆమె అన్నారు. ప్రతి ఒక్కరూ సమస్యను ఎదుర్కొంటారని, తనకు ఒక అవకాశం వస్తే, మరొకరికి పది అవకాశాలు లభిస్తాయని ఆమె అన్నారు. అంతిమ లక్ష్యం ప్రతిభను నిరూపించడమే అని వెల్లడించారు.