ఒక్క షోతో అదరగొట్టింది

ఒక్క షోతో అదరగొట్టింది

కేన్స్ చిత్రోత్సవంలో రెడ్ కార్పెట్ పై నడవాలని, తమ ఫ్యాషన్ ను ప్రపంచానికి తెలియజేయాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు.  అందుకు తగ్గట్టుగానే ప్లాన్ చేస్తుంటారు.  కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో హాలీవుడ్ భామలకు ఏమాత్రం తీసిపోకుండా అందాలను ప్రదర్శించారు మన నటీమణులు.  మొదటి రోజు దీపికా పదుకొనె, ప్రియాంక చోప్రా, కంగనా రనౌత్, డయానా పేంటీలు తమ గ్లామర్ షో తో అదరగొట్టారు.  డిజైనింగ్ డ్రెస్ లతో వావ్ అనిపించారు.  

ఇదిలా రెండోరోజు హుమా ఖురేషి రెడ్ కార్పెట్ పై అదరగొట్టింది.  అదే రోజున దీపికా, ప్రియాంక, కంగనా రనౌత్ లు మెరుపులు మెరిపించారు.  అయితే, ఆదివారం రోజున కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో ఓ సంచలనం జరిగింది.  మాజీ మిస్ వరల్డ్, ఐశ్వర్య రాయ్ బచ్చన్ తన కూతురితో కలిసి ఫిలిం ఫెస్టివల్ లో రెడ్ కార్పెట్ పై క్యాట్ వాక్ చేసింది.  గోల్డెన్ సిల్వర్ కలర్ డ్రెస్ ఐష్ అందానికి మంరింత అందాన్నిచ్చింది.  వావ్ అనిపించే విధంగా ఉన్న ఆ డ్రెస్ కు లక్షలాది మంది ఫిదా అయ్యారు.