ఆ నటి పబ్లిక్ గా.. అలా...

ఆ నటి పబ్లిక్ గా.. అలా...

తెరపై ప్రేమకథలు ఎలా ఉంటాయో... రియల్ లైఫ్ లో కూడా ప్రేమలు, దానికి సంబంధించిన కథలు అలానే ఉంటుంటాయి.  ప్రేమించుకోవడం, కలిసి తిరగడం, తిరిగి విడిపోవడం గ్లామర్ ప్రపంచంలో చాలా కామన్ గా కనిపించే అంశాలు.  బుల్లితెర నటి అంకిత... బిలాల్ పూర్ కు చెందిన విక్కీ జైన్ అనే వ్యాపారవేత్తతో ప్రేమలో పడింది.  అంతకు ముందు ఈ నటి.. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ను ప్రేమించింది.  కొంతకాలం తరువాత ఇద్దరు విడిపోయారు.  అనంతరం అంకిత వ్యాపారవేత్త విక్కీ జైన్ ప్రేమలో పడింది.  

ఇంతవరకు మామూలే.  అయితే, ఈ ఇద్దరు ఓ పబ్లిక్ వేడుకలో కలుసుకున్నారు.  కలుసుకోవడమే కాదు.. అంకిత ఆ వ్యాపారవేత్తకు పబ్లిక్ గా అందరు చూస్తుండగానే లిప్ టు లిప్ కిస్ ఇచ్చింది.  ఇంకేముంది... ఆ వేడుకకు వచ్చిన వారంతా షాక్ అయ్యారు.  మీడియాలో వస్తున్న వార్తలకు అంకిత త్వరలోనే చెక్ పెట్టి ఆ వ్యాపారవేత్తను వివాహం చేసుకోబోతున్నదని తెలుస్తోంది.