ఆ ఫోటోలు చూసి షాకైందట

ఆ ఫోటోలు చూసి షాకైందట

టాలెంట్ ఉన్న హీరోయిన్లకు టాలీవుడ్ ఎప్పుడు రెడ్ కార్పెట్ వేసి స్వగతం పలుకుతుంది అనడంలో సందేహం లేదు. బాలీవుడ్ నుంచి వచ్చిన ఎందరికో అవకాశం ఇచ్చింది.  అలా వచ్చిన వాళ్ళు ఇక్కడ టాప్ హీరోయిన్లుగా చలామణి అవుతున్నారు.  బాలీవుడ్ లో 2011 లో యే సాలి జిందగీ సినిమాతో ఎంట్రీ ఇచ్చి ఆ తరువాత పద్మావతి, భూమి, వాజిర్, మర్డర్ 3 వంటి సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది అతిధి రావు హైదరి.  

తెలుగులో చెలియా, సమ్మోహనం, అంతరిక్షం వంటి సినిమాల్లో చేసి మంచి పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం నాని, సుదీర్ బాబు హీరోలుగా చేస్తున్న వి అనే సినిమాలో హీరోయిన్ గా చేస్తోంది.  అయితే, తాను మొదటి సినిమా చేసే సమయంలో తన ఫోటోల కోసం గూగుల్ లో సెర్చ్ చేసిందట.  తన పేరు కొట్టగానే.. బట్టలు లేనటువంటి కొన్ని ఫోటోలు దర్శనం ఇచ్చాయని, అప్పటి నుంచి తన ఫోటోలు సెర్చ్ చేయడం మానేసినట్టు తెలిపింది అతిధి.