సెల్ఫీ వెనుక అసలు కథేంటి..?

సెల్ఫీ వెనుక అసలు కథేంటి..?

అరవింద సమేత గురించిన ఎలాంటి న్యూస్ వచ్చినా.. ఎలాంటి ఫోటో కనిపించిన సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.  ఇప్పటికే రిలీజైన ఫస్ట్ సింగిల్ సోషల్ మీడియా నిన్నటి వరకు ట్రెండ్ అయింది.  ఈరోజు సాయంకాలం 4:50 గంటలకు సెకండ్ సింగిల్ విడుదల కాబోతున్నది.  పెనీవిటి అనే పల్లవితో సాగే ఈ సాంగ్ సూపర్ గా ఉండబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.  గుండెల్ని పిండేసే విధంగా ట్యూన్ లిరిక్స్ ఉన్నాయని గీత రచయిత రామజోగయ్య శాస్త్రి పేర్కొన్నారు.  

ఇదిలా ఉంటె, ఈషా రెబ్బ తన ట్విట్టర్ అకౌంట్ తారక్, త్రివిక్రమ్ తో కలిసి దిగినసెల్ఫీ ఫోటోను పోస్ట్ చేసింది.  నేను కూడా ఈ సినిమా ఉన్నాను అని చెప్పేందుకు ఈషా ఈ సెల్ఫీ ఫోటోను పోస్ట్ చేసి ఉండొచ్చు. అరవింద సమేత అనగానే పూజ హెగ్డే గురించి చెప్తున్నారుగాని, ఈషా గురించి చెప్పడంలేదు.  అసలు ఈషా రెబ్బ ఈ సినిమా చేస్తుందో లేదో కూడా బయటకు తెలియకపోవడంతో.. తానూ ఉన్నాను గుర్తించండి అని మీడియాకు తెలిపేందుకు ఈషా ఈ ఫోటో పోస్ట్ చేసి ఉండొచ్చు.  ఇప్పుడు ఈ ఫోటో ట్విట్టర్ లో ట్రెండ్ అవుతున్నది.