ప్రొడ్యూసర్ గా మారిన కాజల్

ప్రొడ్యూసర్ గా మారిన కాజల్

సినిమా రంగంలో అవకాశాలు ఎలా దక్కించుకోవాలో కాజల్ అగర్వాల్ కు తెలిసినంతగా మరెవ్వరికీ తెలియవు అంటే అతిశయోక్తి కాదు.  సినిమా అవకాశాలు తగ్గిపోతున్నాయి అనుకునే సమయంలో స్టార్ హీరోలతో సినిమా అవకాశాలు అందిపుచ్చుకొని నిలబడుతుంది.  ఇలా రావాలంటే ఓర్పు నేర్పు తో పాటు సహనం కూడా చాలా అవసరం.  

ప్రస్తుతం కాజల్ సీత సినిమా చేస్తోంది.  ఈ సినిమా మే 24 వ తేదీన రిలీజ్ కాబోతున్నది.  ఇదిలా ఉంటె, తన దగ్గర పనిచేస్తున్న మేనేజర్ నిర్మాతగా మారి మనుచిత్ర అనే సినిమాను తీస్తున్నాడు.  ఈ సినిమాకు కాజల్ సమర్పకురాలిగా పనిచేస్తుంది.  రాజ్ కందుకూరి కొడుకు శివ కందుకూరి హీరో.  మెగా ఆకాష్ హీరోయిన్.  ఈరోజే ఈ సినిమా లాంఛనంగా ప్రారంభమైంది.