దూసుకుపోతున్న అఖిల్ హీరోయిన్

దూసుకుపోతున్న అఖిల్ హీరోయిన్

అఖిల్ రెండో సినిమా హలో సినిమాలో నటించిన హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శిని. ట్రెడిషనల్ లుక్ లో అదరగొట్టిన ఈ హీరోయిన్, నటనలో మంచి మార్కులు కొట్టేసింది.  ఇప్పుడు టాలీవుడ్ తో పాటు దక్షిణాది భాషల్లో బిజీ హీరోయిన్ గా మారిపోయింది.  టాలీవుడ్ లో సాయి ధరమ్ తేజ్ తో చిత్రలహరి చేస్తోంది.  ఈ సినిమా షూటింగ్ చాలా వరకు కంప్లీట్ అయింది.  దీంతో పాటు కోలీవుడ్ లో శివకార్తికేయన్ తో ఓ సినిమా చేస్తోంది.  తమిళంలో ఆమెకు ఇది కొత్త సినిమా.  

దీంతోపాటు మలయాళం సినిమా అరక్కార్ సినిమాలో కీలక పాత్ర చేస్తోంది కళ్యాణి.  మోహన్ లాల్.. నాగార్జునలు హీరోలు.  ప్రియదర్శన్ దర్శకుడు.  తండ్రి సినిమాలో నటించడం చాలా హ్యాపీగా ఉందని అంటోంది కళ్యాణి.