కమిట్ కాలేకే నటనకు దూరమయ్యా : హీరోయిన్ కళ్యాణి

కమిట్ కాలేకే నటనకు దూరమయ్యా : హీరోయిన్ కళ్యాణి

ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ వివాదాలను సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. శ్రీరెడ్డి కాస్టింగ్ కౌచ్ పై పోరాటం మొదలుపెట్టిన దగ్గర నుండి ఈ వివాదం మరింత రాజుకుంది.మీడియా ముందుకొస్తోన్న ప్రతి హీరోయిన్ కి ఈ కాస్టింగ్ కౌచ్ కి సంబంధించిన ప్రశ్నలు ఎదురవుతున్నాయి.కొందరు బోల్డ్ గా స్పందిస్తుంటే మరికొందరు మాత్రం తమకు కాస్టింగ్ కౌచ్ ఎదురుకాలేదని చెబుతున్నారు. తమిళంలో పలు చిత్రాల్లో హీరోయిన్ గా నటించిన కళ్యాణి తాజాగా కాస్టింగ్ కౌచ్ గురించి  స్పందించింది. హీరోయిన్ గా చాన్సులు వస్తుంటే మా అమ్మా చేయమని చెప్పేవారు .. కానీ  కమిట్ మెంట్స్ కు కమిట్ కావాలని నిర్మాతలు సినీ ప్రముఖులు అడగడం చూసి వద్దని అమ్మ చెప్పిందని హీరోయిన్ కళ్యాణి సంచలన వ్యాఖ్యలు చేశారు.ఇక సినిమాల్లోనే కాకుండా బుల్లితెరపైకూడా కాస్టింగ్ కౌచ్ ఎదురైందని అందుకే నటనను వదిలేసా అని చెప్పుకొచ్చింది కళ్యాణి. ఒక టీవీ కార్యక్రమానికి యాంకర్ గా  చేస్తున్నప్పుడు ఆ టీవీ నిర్వాహకుడు  పబ్బుకు పిలిచాడని.. తాను రానని అంటే ఆ తరువాత ఆ టీవీలో ఏ కార్యక్రమంలోనూ తనకు అవకాశం రాకుండా చేసాడని కళ్యాణి ఆరోపించింది. కమిట్ మెంట్లకు తలొంచలేకే సినిమాలకు నటనకు దూరమయ్యానని అంటుంది కళ్యాణి.