భారత్ బంద్ పై కంగనా సంచలన ట్వీట్...వైరల్ 

భారత్ బంద్ పై కంగనా సంచలన ట్వీట్...వైరల్ 

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ భారత్ బంద్ పై మరో సంచలన ట్వీట్ చేశారు.  రైతు సమస్యలతో దేశం ఇప్పటికే అట్టుడికి పోతోందని, ఇప్పుడు భారత్ బంద్ తో దేశం మరిన్ని సమస్యలు ఎదుర్కొనబోతుందని, భారత్ బంద్ చేయడం సరికాదని కంగనా రనౌత్  ట్వీట్ చేశారు.  బంద్ ను, బంద్ కు మద్దతు పలికిన వారిని ఉద్దేశిస్తూ చేసిన కంగనా ట్వీట్ ఇప్పుడు దుమారం రేపుతున్నది.  దేశం ఇబ్బందుల్లో ఉంటె సహకరించాల్సింది పోయి మరింత ఇబ్బందులు తెచ్చిపెడుతున్నారని కంగనా ట్విట్టర్ ద్వారా పేర్కొనడంతో నెటిజన్లు, వివిధ పార్టీల నేతలు మండిపడుతున్నారు.  మొదటి నుంచి కంగనా రనౌత్ కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.  సంచలంగా మారిన ఈ ట్వీట్ ఎన్ని విమర్శలకు దారి తీస్తుందో చూడాలి.