మోనాలిసా లుక్ లో కియారా.. షాక్ లో నెటిజన్లు.. 

మోనాలిసా లుక్ లో కియారా.. షాక్ లో నెటిజన్లు.. 

ఫగ్లీ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కియారా.. ఎంఎస్ ధోని సినిమాతో పాపులర్ అయ్యింది.  ఈ మధ్యలో లస్ట్ స్టోరీస్ చేసి వావ్ అనిపించింది.  ఇటు మహేష్ బాబు భరత్ అనే నేను సినిమాతో ఎంట్రీ ఇచ్చి అదరగొట్టింది.  రామ్ చరణ్ తో వినయ విధేయ రామ చేసింది.  కానీ, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా సందడి చేయలేదు. 

ఇదే సమయంలో ఆమెకు బాలీవుడ్ కబీర్ సింగ్ నుంచి అఫర్ వచ్చింది.  ఈ అఫర్ ఆమెను ఎక్కడికో తీసుకెళ్లింది.  ఈ సినిమా భారీ హిట్టైంది.  2019 లో బాలీవుడ్లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది.  సల్మాన్ ఖాన్ భారత్ సినిమా వసూళ్లను క్రాస్ చేసింది కబీర్ సింగ్.  ఇలా వరసగా సినిమాలు చేస్తూనే.. మరోవైపు ఫోటోషూట్ లు చేస్తోంది.  రీసెంట్ గా ఓ ఫోటో షూట్ చేసింది.  గ్రే కలర్ హెయిర్ తో క్లీవేజ్ అందాలతో అచ్చంగా మోడ్రన్ మోనాలిసాలా ఫోజులు ఇచ్చింది.  ఈఫోటోలు సోషల్ మీడియా వైరల్ గా మారాయి.