మగాడిగా మారిన అలనాటి స్టార్ హీరోయిన్... 

మగాడిగా మారిన అలనాటి స్టార్ హీరోయిన్... 

కరోనా వైరస్ వ్యాప్తి చాలా సినిమా షూటింగ్స్ ను నిలిపివేసింది, ఈ మహమ్మారి విజ్రుంభిస్తున్న సమయంలో సెలబ్రెటీలు కూడా సామాజిక దూరం పాటిస్తున్నారు. అయితే, ఈ లాక్ డౌన్ సమయంలో అభిమానులకు దగ్గరగా ఉంటూ సోషల్ మీడియాలో తన వీడియోస్ మరియు ఫన్నీ పోస్ట్‌లు చేస్తూ వారిని అలరిస్తుంది అలనాటి స్టార్ హీరోయిన్ కుష్బూ. అయితే లాక్ డౌన్ లో కొన్ని బాగా ఫెమస్ అయ్యాయి. అందులో ఒకటి ఆడవాళ్లు మగాళ్లుగా మారితే ఎలా ఉంటుంది. మగవాళ్ళు ఆడవాళ్లలా మారితే ఎలా ఉంటుందని తెలుసుకునే యాప్స్. ఈ యాప్స్‌తో రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు. ఇక ఇప్పుడు ఆ అలనాటి హీరోయిన్ కూడా అదే పని చేసింది. తన ఫోటోనే మెన్ వెర్షన్ లోకి‌ మార్చేసి  ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. ఇక దానికి ''నేను మగాడిని అయిన అంత చెండాలంగా ఏమి లేను'' అని క్యాప్షన్ ఇచ్చింది. కుష్బూ మగాడిగా మారిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రస్తుతం రజినీకాంత్ హీరోగా నటిస్తోన్న ’అన్నాత్తే’ సినిమాలో కుష్బూ నటిస్తోంది.