లావణ్య త్రిపాఠి సంచలన నిర్ణయం : ఇకపై చేయదట... 

లావణ్య త్రిపాఠి సంచలన నిర్ణయం : ఇకపై చేయదట... 

కరోనా సమయంలో మొదలైన చాలా సినిమాలు లాక్ డౌన్ కారణంగా వాయిదా పడ్డాయి.  షూటింగ్ లు ఆగిపోవడంతో ఎవరూ కూడా బయటకు రావడం లేదు.  ఎవరికీ వారు ఇంట్లోనే ఉండిపోతున్నారు.  సినిమా స్టార్స్ ఇంట్లోనే యూట్యూబ్ ఛానల్స్ లో వంటా వార్పు కార్యక్రమాలు చేసుకుంటున్నారు. ఇప్పుడిప్పుడే లాక్ డౌన్ సడలింపులు ఇస్తున్నారు కాబట్టి సినిమా షూటింగులు జరుపుకునేందుకు త్వరలోనే అనుమతి ఇచ్చే అవకాశం ఉన్నది.  

అయితే, తక్కువ మందితో షూటింగ్ జరుపుకునే అవకాశం ఇవ్వొచ్చు.  అయితే, సినిమాల్లో ముద్దు సీన్స్ కామన్ అయ్యాయి. ఇవి లేకుంటే సినిమాలు చూసేందుకు ప్రేక్షకులు పెద్దగా ముందుకు రాని పరిస్థితి.  అయితే, ఇకపై రాబోయే సినిమాల్లో ఇలాంటి ముద్దు సీన్లు ఉండకపోవచ్చు.  ఎందుకంటే కరోనా కారణంగా ఇలాంటి సీన్స్ కు ప్రభుత్వం అనుమతి ఇవ్వదు.  దీనిపై టాలీవుడ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి కొన్ని వ్యాఖ్యలు చేసింది.  లావణ్య త్రిపాఠి లాక్ డౌన్ తరువాత ముద్దు సీన్స్ లో నటించబోనని అంటోంది.  ముందుగానే ఈ విషయాన్ని చెప్పడం మంచిది కదా అని అంటోంది త్రిపాఠి.  ప్రసుత్తం లావణ్య చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి.  ఏ 1 ఎక్స్ ప్రెస్, చావు కబురు చల్లగా సినిమాలు చేస్తున్నది లావణ్య.