ఆమెంటే నిర్మాతలకు ఎందుకంత ఇష్టమో..!!

ఆమెంటే నిర్మాతలకు ఎందుకంత ఇష్టమో..!!

కృష్ణగాడి వీర ప్రేమగాధ సినిమా గుర్తుంది కదా.  అందులో హీరోయిన్ మెహ్రీన్ తన నటనతో ఆకట్టుకుంది.  గ్లామర్ గా మంచి మార్కులు కొట్టేసింది.  ఆ వెంటనే శర్వానంద్ తో మహానుభావుడు, రవితేజ రాజాధి గ్రేట్ సినిమాలు పలకరించాయి.  ఆ రెండు కూడా హిట్ కావడంతో ముక్క విరిగి నేతిలో పడింది.  వరసగా ఆఫర్లు రావడంతో వచ్చిన వాటిని వదులుకోవడం ఇష్టంలేక.. కేరాఫ్ సూర్య, పంతం, జవాన్ వంటి సినిమాల్లో నటించింది.  ఈ మూడు బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలయ్యాయి.  

అయినా ఈ అమ్మడి దూకుడు ఏ మాత్రం తగ్గలేదు.  విజయ్ దేవరకొండతో నోటా సినిమాలో చేస్తున్న మెహ్రీన్ మరో మూడు తెలుగు సినిమాలకు సైన్ చేసింది.  ఒకటి వరుణ్ తేజ్ ఎఫ్2, రెండోది సుదీర్ బాబు సినిమా కాగా మూడోది బెల్లంకొండ శ్రీనివాస్ సినిమా.  కాజల్ హీరోయిన్ గా ఉన్నప్పటికీ, రెండో హీరోయిన్ కు అవకాశం ఉండటంతో మెహ్రీన్ ను తీసుకున్నారు.  మెహ్రీన్ ఇదే దూకుడు ప్రదర్శిస్తే.. స్పీడ్ గా టాప్ ప్లేస్ చేరుకోవడం ఖాయం అవుతుంది.