ప్రభాస్ విషయాన్ని లీక్ చేసిన పూజా..!! 

ప్రభాస్ విషయాన్ని లీక్ చేసిన పూజా..!! 

ప్రభాస్ సాహో సినిమా రిలీజ్ అయ్యి డివైడ్ టాక్ సొంతం చేసుకుంది.  డివైడ్ టాక్ వచ్చినా ఈ సినిమా ఇప్పటికే రూ. 400 కోట్లు వసూలు చేసింది.  ఈ స్థాయిలో వసూలు చేయడం విశేషం.  దీని తరువాత ప్రభాస్ జాన్ సినిమాపై దృష్టి పెట్టారు.  1960 కాలం నాటి కథతో సినిమా తెరకెక్కుతోంది.  అంచనాలు భారీగా ఉన్నాయి.  ఇందులో పూజా హెగ్డే హీరోయిన్.  ఇప్పటికే సినిమా కొంత షూటింగ్ జరిగింది.  

త్వరలోనే షూటింగ్ ప్రారంభం కాబోతున్నది.  జాన్ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న పూజా హెగ్డే ఓ మిడియాకు ఇంటర్వ్యూ ఇచ్చింది.  ఆ ఇంటర్వ్యూలో అనేక విషయాలు చెప్పుకొచ్చింది.  జాన్ సినిమాలో ప్రభాస్ రోల్ ఎలా ఉండబోతుందో చెప్పి షాక్ ఇచ్చింది.  ఇందులో చాలా ఆసక్తికరమైన ట్విస్ట్ లు ఉంటాయని, ప్రభాస్ ను చాలా కొత్తగా కనిపిస్తారని చెప్పింది.  ఇలా లీక్ చేయడం షాక్ అనే చెప్పాలి.  గతంలో రష్మిక కూడా కార్తీ సినిమా టైటిల్ ను బయటపెట్టి చివాట్లు తిన్నది.