మరో బాలీవుడ్ నటికి  కరోనా పాజిటివ్ !

మరో బాలీవుడ్ నటికి  కరోనా పాజిటివ్ !

భారత్ లో కరోనా రక్కసి రోజు రోజుకు  విజృంభిస్తోంది. బాలీవుడ్ ప్రముఖులనుకూడా ఈ వైరస్ భూతం వదలడంలేదు. ఇప్పటికే  అమితాబ్ బచ్చన్ కుటుంబం కరోనా బారినపడడం బీ-టౌన్ వర్గాలను కలవరపాటుకు గురిచేస్తోంది. తాజాగా మరో నటి కరోనా బారిన పడింది . సినీ నటి రాచెల్ వైట్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. జ్వరం దగ్గు లాంటి లక్షణాలు కనిపించడంతో ఆమె కరోనా టెస్ట్ చేయించుకుంది. ఈ పరీక్షలో ఆమెకు పాజిటివ్ గా తేలింది. ఈ విషయాన్ని ఆమె ట్విట్టర్ ద్వారా తెలిపింది.