సమంత నడకకు ఇదే కారణం

సమంత నడకకు ఇదే కారణం

హీరోయిన్ సమంత  తిరుపతి అలిపిరి నుంచి నడక మార్గంలో తిరుమలకు చేరుకున్న సంగతి తెలిసిందే.  ఇటీవల కాలంలో చాలామంది నడక మార్గంలో తిరుమల వెళ్తున్నారు.  మొక్కులు చెల్లించుకుంటున్నారు.  సమంత కూడా అదే బాటలో పయనిస్తోంది.  

సమంత నటించిన సూపర్ డీలక్స్ సినిమా రీసెంట్ గా రిలీజ్ అయ్యింది.  సూపర్ హిట్ టాక్ రావడంతో పాటు సమంత పెర్ఫార్మన్స్ కు మంచి మార్కులు పడ్డాయి.  అలాగే, వివాహం తరువాత సమంత.. నాగ చైతన్య జంటగా చేస్తున్న సినిమా మజిలీ ఈ శుక్రవారం రోజున ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది.  ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటూ తిరుమలకు నడిచి వెళ్లిందని మీడియాలో వార్తలు వస్తున్నాయి.