ప్రచారం కోసం సమంత ఎంత తీసుకుంటుందో తెలుసా..?

ప్రచారం కోసం సమంత ఎంత తీసుకుంటుందో తెలుసా..?

సోషల్ మీడియాలో స్టార్స్ కు మిలియన్ సంఖ్యలో ఫాలోవర్లు ఉంటారు.  ఎంత ఎక్కువమంది ఫాలోవర్లు ఉంటె అంత సంపాదన.  స్టార్స్ వారి సోషల్ మీడియా పేజీలో ఒక పోస్ట్ పెట్టేందుకు భారీ మొత్తంలో ఛార్జ్ చేస్తుంటారు.  కాజల్ అగర్వాల్, తమన్నా, తాప్సిలు ఈ విషయంలో ముందున్న సంగతి తెలిసిందే.  వీరు వారి సోషల్ మీడియా పేజీ లో ఒక పోస్ట్ ను పెట్టేందుకు రూ.2 నుంచి రూ. 3 లక్షల వరకు ఛార్జ్ చేస్తుంటారు.  

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఈ విషయంలో వీరిని మించిపోయింది.  సమంతకు టాలీవుడ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ.  సమంత ఎక్కువగా కాస్ట్యూమ్ బ్రాండ్స్ ను ప్రోమోట్ చేస్తుంటుంది.  రీసెంట్ గా కొన్ని బ్రాండ్ కు సంబంధించిన కాస్ట్యూమ్స్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.  తాజా సమాచారం ప్రకారం, ఒక్కో పోస్ట్ కు రూ.15 నుంచి రూ.20 లక్షల రూపాయల వరకు ఛార్జ్ చేసినట్టుగా తెలుస్తోంది.