ఆ నటులంతా అజిత్ సర్ కాళ్ళని కడగాలి - మీనా

ఆ నటులంతా అజిత్ సర్ కాళ్ళని కడగాలి  - మీనా

సౌత్ హీరోల్లో అజిత్ కు ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుంది.   అందుకు కారణం ఆయన సింప్లిసిటీ, ఎదుటివారిని గౌరవంగా ట్రీట్ చేసే విధానం, క్రమశిక్షణ.  ఇప్పటికే ఎంతో మంది నటీనటులు ఆయన స్వభావాన్ని బాహాటంగానే పొగడగా ఇప్పుడు తెలుగు సీరియల్ నటి, సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిన మీనా కూడ అజిత్ వ్యక్తిత్వాన్ని ఆకాశానికెత్తేస్తూ సంచలనం వ్యాఖ్యలు చేశారు. 

వివరాల్లోకి వెళితే మీనా అజిత్ చేస్తున్న 'విశ్వాసం' సినిమాలో నటిస్తోంది.  షూటింగ్ స్పాట్లో అజిత్ ను కలిసిన ఆమె ఆయన ప్రవర్తనను చూసి 'ఇలాంటి గొప్ప వ్యక్తిని నేనిప్పటి వరకు కలవలేదు.  కెరీర్లో చాలా మంది నటుల్ని చూశాను.   ఒక హిట్ తర్వాత వాళ్లకు యాటిట్యూడ్ పెరిగిపోతుంది.  ఈగో ఉన్నప్పుడు సక్సెస్ ఎక్కువ కాలం నిలవదు.  వాళ్లంతా అజిత్ సర్ కాళ్ళు కడగాలి.  అప్పుడైనా ఆయన వ్యక్తిత్వంలో 10 శాతమైనా వాళ్లకు వస్తుందని అనుకుంటున్నాను' అంటూ సోషల్ మీడియాల్లో తన మనసులోని మాటల్ని బయటపెట్టారు.