నైజీరియన్ల చేతిలో మోసపోయిన హీరోయిన్

నైజీరియన్ల చేతిలో మోసపోయిన హీరోయిన్

ఇటీవల కాలంలో మోసాలు దారుణంగా జరుగుతున్నాయి.  సైబర్ పోలీసులు ఎంతగా హెచ్చరించినా... ఈ ఉచ్చులో ఇరుక్కుంటూనే ఉన్నారు.  సామాన్యుల దగ్గరి నుంచి సెలెబ్రిటీల వరకు అందరు ఈ ఉచ్చులో చిక్కుకుంటున్నారు.  తాజాగా సోనాక్షి వర్మ సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుంది.  

నైజీరియన్లు స్నేహం పేరుతో పేస్ బుక్ ద్వారా పరిచయం అయ్యారు.  అలా పరిచయమైన నైజీరియన్లు ఆ హీరోయిన్ కు పార్సిల్ వచ్చిందని పార్సిల్ కు లక్షా 35 వేల రూపాయలు కట్టాలని చెప్పడంతో వెంటనే ఆ డబ్బును నైజీరియన్లను పంపించింది.  తీరా చూస్తే పార్సిల్ లేదని.. అదంతా బోగస్ అని తేలిపోవడంతో హీరోయిన్ ఇబ్బందుల్లో పడింది.. వెంటనే సైబర్ పోలీసులను సంప్రదించి కంప్లైంట్ చేసిందట ఈ అమ్మడు.