అవకాశాల కోసమే పాపం సోనాల్ ఇలా

అవకాశాల కోసమే పాపం సోనాల్ ఇలా

ఒక సినిమా హిట్టయితే వరసగా కొన్ని సినిమాల్లో ఆఫర్లు వస్తాయి.  చేస్తున్న సినిమాలు బాగున్నాయని టాక్ వస్తే చాలు వరసగా ఆఫర్లు వెతుక్కుంటూ వస్తాయి.  కానీ, సోనాల్ విషయంలో అలా కాదు. టాలీవుడ్ లో బాలయ్యతో లెజెండ్ చేసింది.  సినిమా సూపర్ హిట్టైంది.  ఆ తరువాత బాలకృష్ణతోనే డిక్టేటర్ చేసింది.  ఆ తరువాత మరో సినిమా చేయలేదు తెలుగులో.  

అటు బాలీవుడ్ లో ఈ అమ్మడు గతేడాది ఫాల్తాన్, జాక్ అండ్ జిల్ సినిమాలు చేయండి.  ఆ తరువాత ఇప్పటి వరకు మరో సినిమా చేయలేదు.  ప్రస్తుతం స్కై ఫైర్ అనే వెబ్ సీరీస్ చేస్తోంది.  జీ ఒరిజినల్ ఈ సీరీస్ ప్రసారం కాబోతున్నది.  అవకాశాలు లేక సమయం దొరికినప్పుడల్లా విదేశాలకు చెక్కేసి అక్కడ బీచ్ లలో బికినీ షోలతో అదరగొడుతుంది.  ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి యువతను ఆకట్టుకుంటోంది సోనాలి చౌహన్.  రీసెంట్ గా సోనాల్ పింక్ బికినీలో అదిరిపోయే ఫోజు ఇచ్చింది.  ఈ ఫోటో యువతను విపరీతంగా ఎట్రాక్ట్ చేసింది.