అదే తమన్నాకు కలిసి వచ్చిందట..!

అదే తమన్నాకు కలిసి వచ్చిందట..!

తమన్నా... టాలీవుడ్ లో శ్రీ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.  మొదటి సినిమాతో పెద్దగా పేరు రాకున్నా ఆ తరువాత ఈ అమ్మడు టాలీవుడ్లో అదిరిపోయే సినిమాల్లో నటించింది. 13 వ ఏటనే సినిమా రంగంలోకి అడుగుపెట్టింది.  బాహుబలి, సైరా సినిమాలు కెరీర్లో బెస్ట్ సినిమాలుగా చెప్పుకోవచ్చు.  తమన్నాకు ఇండస్ట్రీలో ఓ నిక్ నేమ్ ఉన్న సంగతి తెలిసిందే.  ఆమెను అంతా మిల్కి బ్యూటీ అంటారు.  

మిల్కి బ్యూటీ తన అందంతో ఆకట్టుకుంది.  ఈ ఏడాది వరసగా ఎఫ్2, సైరా రెండు హిట్స్ అందుకుంది.  ప్రస్తుతం తమన్నా కోలీవుడ్ లో యాక్షన్ సినిమా చేస్తోంది.  దీంతో పాటుగా ఈ అమ్మడు హర్రర్ సినిమాల్లో కూడా చేస్తుండటం విశేషం. అవకాశాలు తగ్గిపోతున్నాయి అనుకున్న సమయంలో హిట్ సినిమాలో నటించి మరలా లైన్లోకి వస్తోంది.