ఎగ్జిబిట్ కోసం మరీ అంత ఎగ్జిబిషన్ అవసరమా..?

ఎగ్జిబిట్ కోసం మరీ అంత ఎగ్జిబిషన్ అవసరమా..?

సినిమా హీరోయిన్లు నిత్యం వార్తల్లో ఉండలాంటే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండాలి.. ప్రముఖ మ్యాగజైన్ కవర్ పేజీలకు హాట్ హాట్ ఫోజులు ఇస్తుండాలి..హైఎండ్ యాక్సారిస్ తో ఆకట్టుకోవాలి... వారికి సంబంధించిన ప్రతి ఒక్కరి ప్రత్యేకంగా ఉండాలి.  అలా ఉంటేనే ప్రత్యేకంగా కనిపిస్తారు.  ప్రముఖంగా అందరి అందరిలో గుర్తింపు పొందుతారు.  ఈ విషయం టాలీవుడ్ హీరోయిన్ల కంటే కూడా బాలీవుడ్ హీరోయిన్లకు బాగా తెలుసు.  

బాలీవుడ్లో అడుగుపెట్టిన వెంటనే సోషల్ మీడియాలో తమను తాము ప్రమోట్ చేసుకోవడానికి మొదట ప్రధాన్యత ఇస్తారు.  ఇలా అడుగుపెట్టి సోషల్ మీడియాలో దూకుడును ప్రదర్శిస్తున్న హీరోయిన్లలో ఒకరు తారా సుతారియా.  కరణ్ జోహార్ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 సినిమాతో పరిచయం అయ్యింది.  ఒక్క సినిమాతోనే ఆకట్టుకుంది.  ఫోటో షూట్లు మొదలెట్టింది.  ఇందులో భాగంగా ఎగ్జిబిట్ అనే మ్యాగజైన్ కు ఫోజులు ఇచ్చింది.  శిరోజాలతో పాటు హాట్ హాట్ అందాలను అలా గాల్లో వదిలేసి వయ్యారంగా కూర్చొని.. సెప్టెంబర్ కవర్ పేజీపైకి ఎక్కింది.  అసలే లేటెస్ట్ హీరోయిన్.. పైగా హాట్ ఫోజులు..అందాల ఎగ్జిబిషన్ తో ఎగ్జిబిట్ సేల్స్ బంపర్ గా ఉంటాయనడంలో సందేహంలేదు.  ఈ ఫోటో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నది.