ఫోటోషూట్స్ తోనే సరిపెట్టుకుంటున్న నితిన్ హీరోయిన్ !

ఫోటోషూట్స్ తోనే సరిపెట్టుకుంటున్న నితిన్ హీరోయిన్ !

పూరీజగన్నాద్ - యాంగ్ హీరో నితిన్ కాబినేషన్లో వచ్చిన 'హార్ట్ ఎటాక్' సినిమాతో పరిచయమైన చిన్నది అదాశర్మ . ఈ సినిమాలో తన క్యూట్ నెస్ తో ఆకట్టుకున్న అదా కు  ఆ తరువాత తెలుగులో అనుకున్నంత క్రేజ్ రాలేదు. దాంతో అమ్మడికి అవకాశాలు కరువయ్యాయి. దాంతో బాలీవుడ్ బాట పట్టింది ఈ కుర్రది.  అక్కడ కూడా అమ్మడికి అదృష్టం కలిసి రాలేదు. దాంతో ఫొటో షూట్ లతో కాలం గడిపేస్తుంది. రెగ్యులర్ హీరోయిన్లతో పోలిస్తే అందాల ఆరబోతకు అదా ఎప్పుడూ అడ్డు చెప్పదు.

దాంతో అమ్మడికి సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఏర్పడింది. తన అందాలతో కుర్రకారుకి నిద్రపట్టకుండా చేయడమే అదాశర్మ పనైంది. సోషల్ మీడియాలోనే కాకూండా రెగ్యులర్ గా మ్యాగజైన్ కవర్ షూట్లతోనూ వేడెక్కిస్తూనే ఉంది. అదా అందాల ఆరబోత చూసైనా ఎవరో ఒకరు అవకాశం ఇస్తారనుకుంటే అదీనూ లేదు.  దాంతో అమ్మడి పై ట్రోల్స్ కూడా మొదలైయ్యాయి. 'ఫొటోలతోనే సరిపెడతావా .. లేక సినిమాలు చేసే ఆలోచన ఏమైనా ఉందా ..?' అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.