అమ్మాయి నుంచి అబ్బాయిలా..

అమ్మాయి నుంచి అబ్బాయిలా..

జుట్టును అమ్మడు ఎలాంటి కొప్పేసినా అందంగానే ఉంటుంది అంటారు.  ఈ సామెతను అవసరాన్ని బట్టి వాడుతుంటారు.  అమ్మాయిలు ఎంత అందంగా ఉన్నా..మూతిమీద మీసాలుంటే ఎలా ఉంటారు.. ఒక్కసారి ఆలోచించండి.  విచిత్రంగా అనిపిస్తుంది కదా.  ఇలాంటి చిత్రమే చేసింది అదా శర్మ.  

ఎలంటుందో చూడాలనుకుందో ఏమో.. మూతిమీద మీసాలు అంటించుకుంది.  అది కోరమీసాలు.  అందమైన అమ్మాయి అలాంటి మీసాలు పెట్టుకుంటే ఎలా ఉంటుంది.. మామూలుగానైతే ఎవరికీ నచ్చదు.  కానీ, అదా అందం ముందు ఆ మీసాలు కూడా అందంగా మారిపోయాయి.  ఈ ఫోటో షేర్ చేసిన కొన్ని గంటల్లోనే ఒక లక్షా 47 వేల లైక్స్ వచ్చాయి అంటే అర్ధం చేసుకోవచ్చు.  ఫోటో ఎంత పాపులర్ అయిందో.